Wednesday, August 19, 2026
E-PAPER
Homeఆటలుడూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.5 -3 తేడాతో పాకిస్తాన్ జట్టుపై భారత్ గెలుపోందింది.

తొలి అర్ధ భాగంలో హర్మన్‌ప్రీత్‌ సేన నాలుగు గోల్స్‌తో అదరగొట్టగా.. పాక్ రెండు గోల్స్ చేసింది. రెండో అర్ధ భాగంలో ఇరుజట్లు చెరో గోల్ మాత్రమే చేశాయి. మ్యాచ్‌ ప్రారంభమైన 5వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌.. 11వ నిమిషంలో అభిషేక్‌ గోల్‌ చేశారు. రెండో క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్‌ (21వ), అభిషేక్‌ (24వ)మళ్లీ చెరో గోల్‌ కొట్టారు. మూడో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ (35వ నిమిషం) గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. పాక్ తరఫున హన్నన్ షాహిద్ (22వ, 46వ), సఫ్యాన్ ఖాన్ (24వ) గోల్స్ సాధించారు.

ఈ గెలుపుతో భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాక్ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -