నవతెలంగాణ-టేకుమట్ల
మండలంలోని చలి వాగు, మానేరు వాగుల నుండి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు బుధవారం ఎస్సై అమూల్య పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక లోడుపై పరదా తప్పనిసరిగా కట్టుకోవాలని సూచించారు. ట్రాక్టర్లకు డెక్కులు ఉండకూడదని, డ్రైవింగ్ చేస్తూ పాటలు వింటూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. వేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల, ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రతి ట్రాక్టర్ కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు, డ్రైవర్ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. సూచనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రాక్టర్లలోని (మ్యుజిక్ ప్లేయర్) డెక్కును తొలగింపజేశారు.
ట్రాక్టర్ డ్రైవర్లకు ఎస్సై కీలక సూచనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



