Wednesday, August 19, 2026
E-PAPER
Homeబీజినెస్'గురు'కు హలో చెప్పండి..స్విగ్గీ 24x7 AI వ్యాపార భాగస్వామి..

‘గురు’కు హలో చెప్పండి..స్విగ్గీ 24×7 AI వ్యాపార భాగస్వామి..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తమ 24×7 AI  వ్యాపార భాగస్వామి- గురు- రెస్టారెంట్ భాగస్వాముల కోసం ప్రత్యేకించిన ప్లాట్ ఫాం ఆవిష్కరణను ప్రారంభిస్తున్నామని భారతదేశంలో మొదటి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (స్విగ్గీ లిమిటెడ్, NSE: SWIGGY / BSE: 544285)ఈరోజు ప్రకటించింది. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి, సేల్స్ ఫన్నెల్స్ అనుకూలం చేయడానికి, కార్యకలాపాల సందేహాలను సెకండ్లలో పరిష్కరించడానికి – ఇదంతా వినియోగించడానికి సులభమైన విధానంలో, ఒకే సంభాషణాపరమైన చాట్ ద్వారా వీలు కల్పించడం ద్వారా స్విగ్గీ రెస్టారెంట్ భాగస్వాములకు సామర్థ్యం కల్పించడానికి ఈ రకమైన AI అసిస్టెంట్ రూపొందించబడింది. ఇంటర్ ఫేస్ హిందీ, కన్నడం, తమిళం, అస్సామీస్, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, మళయాళం మరియు తెలుగు సహా  20 కంటే ఎక్కువ ప్రాంతీయ భాషలలో లభిస్తోంది. తమ ప్రకటనలను నిర్వహించడానికి మరియు డిస్కౌంట్ కాంపైన్స్ కోసం మరియు పన్ను నివేదికలు మరియు చెల్లింపుల సంగ్రహాలు సహా  తమ చెల్లింపు అనుబంధాలను వివరంగా చూడటానికి  ఇది రెస్టారెంట్ భాగస్వాములకు వీలు కల్పిస్తోంది .

గురుతో, స్విగ్గీ వారి రెస్టారెంట్ భాగస్వాములు రోజూవారీ రెస్టారెంట్ నిర్వహణను సులభతరం చేసే లక్ష్యంతో వివిధ రకాల పనులు మరియు సందేహాలలో వారికి సహాయం చేయడానికి  24×7 అసిస్టెంట్ ను కలిగి ఉంటారు. ఒకే చాట్ ప్రాంప్ట్ ద్వారా తమ ప్రకటనల కాంపైన్స్ ను ప్రారంభించడానికి, సమీక్షించడానికి మరియు సవరించడానికి రెస్టారెంట్ భాగస్వాములు గురును ఉపయోగించవచ్చు. దీనికి అదనంగా వారు తమ GMV మరియు ఆర్డర్స్ యొక్క పూర్తి ఫన్నెల్ విశ్లేషణతో పాటు ఏది  సరిగ్గా పని చేయడం లేదు అనే  వివరణాత్మకమైన  నివేదిక మరియు దానిని పరిష్కరించడానికి సిఫారసులను  కూడా వారు పొందవచ్చు.  సేల్స్, ఆర్డర్లు, AOV మరియు 30+ ఇతర  మెట్రిక్స్ సహా కీలకమైన  కొలప్రమాణాలలో మూల్యాంకనం చేయడానికి గురు రూపొందించబడింది.  కాలక్రమేణా వీటిని స్థిరంగా అనుసరిస్తారు.

అంతే కాదు. గురులో ఉన్న మెనూ విషయాలు అనేవి విభాగం సామర్థ్యాన్ని మరియు తమకు ఏదీ సరిగ్గా పని చేస్తోంది అని   ద్వారా  భాగస్వాములు వస్తువులను చేర్చడానికి, వర్ణనలు తయారు చేయడానికి, మరియు వ్యక్తిగత అభిప్రాయాలను అందించడానికి అగ్ర-విక్రయ వస్తువులను చేర్చడానికి అవకాశం ఇస్తాయి.

రోహిత్ కపూర్, CEO, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ ప్రారంభం గురించి వివరిస్తూ ఇలా అన్నారు, “ వ్యాపారాలు ఎలా ఆపరేట్ చేస్తాయి అని ఈరోజు, AI పునర్నిర్వచించింది మరియు పరిశ్రమల్లో ఉన్నతమైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోంది. 12 సంవత్సరాలకు పైగా రెస్టారెంట్లతో భాగస్వామం కలిగి ఉండి మేము కార్యకలాపాల డిమాండ్స్ ను మరియు ప్రతి ఒక్క రోజు మా భాగస్వాములను  ఎదుర్కొనే స్థిరమైన వివిధ పనులను  అర్థం చేసుకున్నాము.  AIని తమ రోజూవారీ పని ప్రవాహంలో సమీకృతం చేయడం అనేది మేము కలిసి చేసే ప్రయాణంలో  ఒక సహజమైన తదుపరి చర్య. గురుతో, మేము AI- మొదటి అసిస్టెంట్  కార్యక్రమం పరిచయం చేస్తున్నాం. ఇది రోజూవారీ రెస్టారెంట్ నిర్వహణను పునర్నిర్వచిస్తుంది,  24×7 మద్దతును, వేగవంతమైన సందేహాల పరిష్కారం మరియు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో సహాయపడే ఆచరణాత్మకమైన సామర్థ్యం అంశాలను కేటాయిస్తుంది. ”

720+ నగరాల్లో ప్రారంభించబడుతున్న, గురు 2.7 లక్షలు కంటే ఎక్కువమంది రెస్టారెంట్లకు ప్రయోజనం కలిగిస్తుంది, పొరుగున ఉన్న కిచెన్స్ నుండి మల్టి-అవుట్ లెట్ రెస్టారెంట్ల వరకు ఇది ఉపయోగపడుతుంది. తమ కార్యకలాపాలు సజావుగా కొనసాగడానికి, లాభాలు పెంచడానికి మరియు వాస్తవిక సమయంలో అంశాలను స్వేచ్ఛగా పొందడానికి కావలసిన సాధనాలను రెస్టారెంట్ భాగస్వాములకు అందచేయాలని స్విగ్గీ వారి నిబద్ధతను ఈ ఆవిష్కరణ సూచిస్తోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -