Tuesday, September 8, 2026
E-PAPER
Homeబీజినెస్ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ లైఫ్ పార్ట్‌నర్ స్టాక్ 2.0’

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐసీఐసీఐ లైఫ్ పార్ట్‌నర్ స్టాక్ 2.0’

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 2026లో తమ పార్ట్‌నర్ స్టాక్‌కు (Partner Stack) మరిన్ని సామర్థ్యాలను జోడించింది. ‘ఐసీఐసీఐ లైఫ్ పార్ట్‌నర్ స్టాక్ 2.0’గా తీర్చిదిద్దింది. ఈ స్టాక్‌లో ఏఐ ఆధారిత టూల్స్, భాగస్వాములు-సిస్టమ్‌ మధ్య మరింత విస్తృత అనుసంధానత మరియు సేల్స్, ఆన్‌బోర్డింగ్, కస్టమర్ సర్వీసింగ్‌వ్యాప్తంగా కంపెనీ యొక్క అడ్వైజర్లు అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కి ఉపయోగపడే డిజిటల్ సామర్థ్యాలు మొదలైనవి పొందుపర్చబడ్డాయి.

డిజిటల్‌గా కస్టమర్లకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను గుర్తించడం, కొటేషన్లను జనరేట్ చేయడం, కస్టమర్లను చేర్చుకోవడం, సేవలందించడంలో అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్లకు తోడ్పాటు అందించడం ద్వారా కస్టమర్ల ప్రస్థానాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ అప్‌గ్రేడ్ డిజైన్ చేయబడింది. ఈకోట్ (eQuote) యాప్ అనేది కస్టమర్ సెగ్మెంట్, జీవితంలోని దశని బట్టి సముచితమైన ప్రోడక్టులను సిఫార్సు చేసేందుకు ఏఐ ఆధారిత ప్రోడక్ట్ రికమెండర్‌ను ఉపయోగిస్తుంది. వ్యక్తిగతీకరించిన కొటేషన్లను జనరేట్ చేసేందుకు, షేర్ చేసేందుకు అడ్వైజర్లకు సహాయకరంగా ఉంటుంది. లివా (LIVA) అనే ఏఐ ఆధారిత చాట్‌బాట్ అనేది, కస్టమర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు ప్రోడక్ట్ యొక్క ఫీచర్లు, కొటేషన్లను యాక్సెస్ చేసుకోవడంలో అడ్వైజర్లకు సహాయకరంగా ఉండే కన్వర్సేషనల్ ఇంటర్‌ఫేస్‌గా ఉపయోగపడుతుంది.

“జీవిత బీమా సొల్యూషన్స్‌ను అర్థం చేసుకోవడంలోనూ, కొనుగోలు చేయడంలోను కస్టమర్లకు సహాయపడటంలో మా అడ్వైజర్లు, డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్లు కీలక పాత్ర పోషిస్తారు. సముచితమైన సొల్యూషన్స్‌ని కనుగొనడం, కొటేషన్స్‌ని జనరేట్ చేయడం నుంచి ఆన్‌బోర్డింగ్ మరియు సర్వీసింగ్ వరకు రోజువారీ కార్యకలాపాలను సరళతరం చేసే విధంగా వారికి డిజిటల్ మరియు ఏఐ ఆధారిత సాధనాలను అందించే లక్ష్యంతో ఐసీఐసీఐ లైఫ్ పార్ట్‌నర్ స్టాక్ 2.0 తీర్చిదిద్దబడింది. పార్ట్‌నర్ సిస్టమ్‌లలో ఈ సామర్థ్యాలను జోడించడం ద్వారా నిర్దిష్ట ప్రక్రియలు మరింత నిరాటంకంగా, వేగవంతంగా పూర్తి కాగలవు. తద్వారా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని, సేవలందించడంపై మా భాగస్వాములు మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుంది” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ Mr. అమీష్ బ్యాంకర్ (Amish Banker) తెలిపారు.

పార్ట్‌నర్ సిస్టమ్‌లతో మరింత అనుసంధానమయ్యేందుకు పార్ట్‌నర్ స్టాక్ 2.0 తోడ్పడుతుంది. పార్ట్‌నర్ సీఆర్ఎం ప్లాట్‌ఫాంలతో అనుసంధానం కావడం వల్ల కస్టమర్ల ప్రస్థానం మరింత సరళతరం అవుతుంది. ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా భాగస్వాములు తమ స్వంత ప్లాట్‌ఫాంల నుంచే కస్టమర్ సర్వీస్ రిక్వెస్ట్‌లను రెయిజ్ చేయొచ్చు. ఈ రిక్వెస్టులు మరియు స్టేటస్ అప్‌డేట్‌లు డిజిటల్‌గా షేర్ చేయబడతాయి. సభ్యుల వివరాలను పంపేందుకు, క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసేందుకు, సర్వీసింగ్ అవసరాలను షేర్ చేసేందుకు గ్రూప్ పార్ట్‌నర్స్ కూడా ఏపీఐ సర్వీసులను ఉపయోగించవచ్చు.

సరికొత్తగా తీర్చిదిద్దిన రిటైల్, గ్రూప్ పార్ట్‌నర్ పోర్టల్స్ అనేవి క్లయింట్ వివరాలు, రిపోర్టులు, రెమ్యూనరేషన్ వివరాలు, ఇతరత్రా సర్వీసింగ్ ఆవశ్యకతలను పార్ట్‌నర్లు తెలుసుకునేందుకు తోడ్పడతాయి. ఆన్‌బోర్డింగ్‌ను సరళతరం చేసే దిశగా ఆధార్ కోసం యూఐడీఏఐ, సీకేవైసీ కోసం సీఈఆర్ఎస్ఏఐ, ఐడీవీ కోసం వాహన్, జీఎస్‌టీఎన్, ఈపీఎఫ్‌వో, సీఏఎస్, పెర్ఫియోస్ (Perfios) లాంటి జాతీయ స్థాయి బహుళ డేటాబేస్‌లకు పార్ట్‌నర్ స్టాక్ అనుసంధానం చేయబడింది. ఈ అనుసంధానత వల్ల అప్లికేషన్ ఫారంలో దాదాపు 70 శాతం భాగం వరకు ముందుగానే పూరించబడగలదు (ప్రీ-ఫిల్). తద్వారా కేవైసీ, ఆదాయం డాక్యుమెంట్లను సేకరించడం, అప్‌లోడ్ చేయాల్సిన భారం తగ్గుతుంది.

ఏఎస్‌బీఏ (ASBA) మరియు వాట్సాప్ ఆధారిత పేమెంట్స్ సహా కస్టమర్లు బహుళ విధానాల్లో ప్రీమియంలను చెల్లించే ఆప్షన్లను కూడా ఈ ప్లాట్‌ఫాం అందిస్తుంది. దీనికి అదనంగా ఏఐ ఆధారిత ప్రీ-ఇష్యూయెన్స్ వీడియో వెరిఫికేషన్‌ అనేది రిస్క్ మరియు ఫ్రాడ్‌లను గుర్తించే వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా అండర్‌రైటింగ్‌ను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది.   

200కు పైగా పార్ట్‌నర్-సిస్టమ్ ఇంటిగ్రేషన్స్‌ అనేవి కంపెనీ యొక్క డిజిటల్ వ్యవస్థ విస్తృత స్థాయిని ప్రతిబింబిస్తాయి. బిజినెస్ అప్లికేషన్లలో 99 శాతం డిజిటల్‌గానే అందుకోబడుతున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2.7 కోట్లకు పైగా డిజిటల్ సర్వీస్ ఇంటరాక్షన్స్ నమోదు కాగా, 54 శాతం సేవింగ్స్ పాలసీలు.. దరఖాస్తు చేసుకున్న రోజునే జారీ చేయబడ్డాయి.

క్లెయిమ్స్ అనుభూతిని మరింతగా మెరుగుపర్చేలా టెక్నాలజీ ఆధారిత కస్టమర్ సర్వీసింగ్‌పై కంపెనీ మరింతగా దృష్టి పెడుతోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్  2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, నాన్-ఇన్వెస్టిగేటెడ్ డెత్ క్లెయిమ్స్ పరిష్కారానికి సగటున ఒకే ఒక్క రోజు టర్నెరౌండ్ సమయంతో పరిశ్రమలోనే అత్యుత్తమంగా 99.3 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని సాధించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -