Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధుల పట్ల కార్యదర్శి నిర్లక్ష‍్యం వీడాలి

విధుల పట్ల కార్యదర్శి నిర్లక్ష‍్యం వీడాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల పరిధిలోని హండేకేలూర్‌ గ్రామ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ షిండే విధుల పట్ల నిర్లక్ష‍్యం వహిస్తున్నారని సర్పంచ్‌ జీ. లక్ష‍్మణ్‌ అన్నారు. గ్రామ పంచాయతీలోని సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని, ప్రతి దానికీ మండల స్ధాయి అధికారులను సంప్రదించండంటూ అసహనానికి గురి చేస్తున్నాడని తెలిపారు. గ్రామసభలో పాలకవర్గం తీర్మాణించిన పనులను పరిష్కరించడం లేదని చెప్పారు. తాజాగా బుధవారం ఈ విషయమై పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డిని సర్పంచ్‌ కలిసి, కార్యదర్శి తీరుపై వాపోయారు. ఈ క్రమంలో కార్యదర్శిని నవతెలంగాణ వివరణ కోరగా.. గ్రామ సర్పంచ్‌ తనను బదిలీపై ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుందని సమాధానమిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -