నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశం తమ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, భారతదేశంలోని ఐదవ అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పాదక సంస్థ అయిన వేదాంత పవర్ లిమిటెడ్, ఆధారపడతగిన రీతిలో విద్యుత్‌ను అందించడం, దేశీయ ఇంధన సరఫరాలను సురక్షితం చేయడం , దీర్ఘకాలిక సామర్థ్య విస్తరణ పై పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
మొత్తంగా 4.18 గిగావాట్ల కార్యాచరణ సామర్థ్యం తో పాటుగా 0.6 గిగావాట్ల ప్రారంభ దశలో ఉన్న సామర్థ్యంతో సహా, 4.78 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగిన వేదాంత పవర్ ప్రస్తుతం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్‌లలో విస్తృత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ సామర్థ్యంలో సుమారు 74% దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPAs) మద్దతు కలిగి ఉండగా, దాని కార్యాచరణ సామర్థ్యంలో దాదాపు 85% దేశీయ బొగ్గు లింకేజీ లను కలిగి ఉంది. ఇది అధిక ఇంధన భద్రతను , కార్యకలాపాల స్థిరత్వాన్ని అందిస్తుంది. విశ్వసనీయమైన విద్యుత్ ఉత్పత్తికి వేదాంత పవర్ అనుసరించే విధానంలో ఇంధన భద్రత ఒక కీలకమైన అంశంగా నిలుస్తుంది. దీని కార్యాచరణ సామర్థ్యంలో సుమారు 85% వాటా, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) మరియు నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) వంటి కోల్ ఇండియా అనుబంధ సంస్థల ద్వారా దీర్ఘకాలిక దేశీయ బొగ్గు లింకేజీ లపై ఆధారపడి ఉంది. ఇందులో పంజాబ్‌లోని వేదాంత పవర్ తల్వండి సాబో థర్మల్ ప్లాంట్‌కు SECL మరియు NCL నుండి 100% లింకేజీ బొగ్గు, మరియు ఒడిశాలోని వేదాంత పవర్ ఝార్సుగూడ థర్మల్ ప్లాంట్‌కు MCL నుండి 100% లింకేజీ బొగ్గు అందుతుంది.
వేదాంత పవర్ తమ పోర్ట్‌ఫోలియో అంతటా ఇంధన సౌలభ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్‌లో, కంపెనీ ఆ ప్లాంట్‌ను మొదట్లోని దిగుమతి-బొగ్గు ఆధారిత ఇంధన మిశ్రమం నుండి దేశీయ బొగ్గు వైపు మారుస్తోంది. ఈ మార్పు యొక్క లక్ష్యం ఇంధన భద్రతను పెంచడం , ప్రపంచ ఇంధన మార్కెట్ అస్థిరతకు గురికావడాన్ని తగ్గించడం.
ఈ సందర్భంగా వేదాంత పవర్ లిమిటెడ్ హోల్ టైం డైరెక్టర్ , సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ, “దేశ ఆర్థిక స్వాతంత్యం కు, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఆకాంక్షలకు ఇంధన భద్రత అత్యంత కీలకం. వేదాంత పవర్ వద్ద మేము, నమ్మకమైన మరియు సురక్షితమైన విద్యుత్‌ను అందించడం, దేశీయ ఇంధన అవసరాలను తీర్చటం, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా మా వంతు పాత్ర పోషించడానికి కట్టుబడి ఉన్నాము. భారతదేశ విద్యుత్ అవసరాలు పెరుగుతూనే ఉన్నందున, అభివృద్ధి చెందుతున్న స్వచ్ఛ ఇంధన సాంకేతికతలతో పాటు, నమ్మకమైన థర్మల్ విద్యుత్ కూడా ఇంధన మిశ్రమంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ వృద్ధి ఆకాంక్షలకు మద్దతునిచ్చే, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు దోహదపడే ఒక పటిష్టమైన , వైవిధ్యభరితమైన విద్యుత్ పోర్ట్‌ఫోలియోను నిర్మించడంపై మా దృష్టి ఉంది.” అని అన్నారు.
మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తాత్కాలిక సీఈఓ కె. బినూ రాఫెల్ మాట్లాడుతూ, “స్వాతంత్య్రం అంటే మరింత స్థిరత్వంను పెంపొందించుకోవడం, బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం. మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ వద్ద , దేశీయ బొగ్గు వినియోగాన్ని పెంచడం వైపు మా పరివర్తన ఈ బృహత్తర జాతీయ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశీయ బొగ్గు వినియోగాన్ని క్రమంగా పెంచడం ద్వారా మేము ఇంధన భద్రతను బలోపేతం చేస్తున్నాము, మరింత స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్మిస్తున్నాము” అని అన్నారు.
మరింత ముందుకు చూస్తే, వేదాంత పవర్ ఆర్థిక సంవత్సరం 2033 నాటికి తమ సామర్థ్యాన్ని 12 GW లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారతదేశంలోని అగ్రగామి మూడు ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలవాలనేది దీని ఆశయం. భారతదేశం యొక్క పెరుగుతున్న బేస్‌లోడ్ మరియు నిరంతర విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్ విద్యుత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూనే ఉన్నప్పటికీ, కంపెనీ తమ దీర్ఘకాలిక వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా అణు, జల , బ్యాటరీ నిల్వ వ్యవస్థలలోని అవకాశాలను కూడా అంచనా వేస్తోంది. భారతదేశ ఇంధన పరివర్తనకు, నమ్మకమైన సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని కొత్త, స్వచ్ఛమైన , సౌకర్యవంతమైన ఇంధన వనరులతో కలిపే సమతుల్య విధానం అవసరమని కంపెనీ విశ్వసిస్తోంది. ముఖ్యంగా అణుశక్తి, దేశం తక్కువ కార్బన్ ఉద్గారాలు గల ఇంధన వ్యవస్థ వైపు మారడానికి తోడ్పడుతూ, నిరంతరాయంగా 24×7 విద్యుత్తును అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
భారతదేశం మరింతగా ఇంధన-కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగమిస్తున్న తరుణంలో, వేదాంత పవర్ విశ్వసనీయమైన విద్యుత్ ఉత్పత్తి, దేశీయ ఇంధన భద్రత , దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలలో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఇంధన భద్రత పునాదులను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది.



