Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

- Advertisement -

రైతు సంఘం జిల్లా నాయకులు మోహన్ పటేల్
నవతెలంగాణ – సదాశివనగర్

సదాశివనగర్ మండల కేంద్రంలో మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా  దొడ్లే మోహన్ పటేల్ మాట్లాడుతూ .. గత 30 రోజులకు పైగా ఐకెపి కేంద్రంలో వరి ధాన్యము తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యముకు వెంటనే డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

 రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు అప్పులు చేసి పంట పండిస్తే అధిక వర్షాలతో పంట దెబ్బతిని ఉన్న కాస్త వరి ధాన్యాన్ని మార్కెట్లోకి తెస్తే కొనే నాధుడే లేడని ఆవేదన వెలిబుచ్చారు.  రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు మార్కెట్లకు  తెచ్చిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి సరైన వసతులు లేక పలుమార్లు తడిసి ఇబ్బందులు పడ్డారని, ధాన్యం నిలువ కోసం ఒక్కొక్క రైతు 10 నుంచి 15వేల రూపాయలు ఖర్చు ఆరబెట్టడానికి ఒక్క దగ్గర పోయడానికి కూడా కూలీలకు ఖర్చు చేయవలసి వస్తుందని, ఇంత చేసిన వెనువెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. 

మార్కెట్ కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని అమ్మిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని లేనిచో పెద్ద ఎత్తున రైతుల చేత ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ కృష్ణంరాజు గంగాధర్ స్వామి  దశరథ్ రాములు శ్రావణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -