– ఖమ్మం జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
– గన్నీ బ్యాగులు, లారీలు లేవంటూ ఇబ్బందులు
నవతెలంగాణ-కూసుమంచి
ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో రైతులు ఖమ్మం టూ సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం బైటాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గన్నీ సంచులు లేవనికాంటా వేయడం లేదనీ, కాంటా వేసిన తర్వాత లారీలు లేవని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొనుగోళ్లు ఆలస్యమై అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు తక్షణ పరిష్కారం కోసం రోడ్డెక్కి బైటాయించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి నచ్చ చెప్పటంతో వారు ఆందోళన విరమించారు.
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES