-జిల్లా డిఆర్డివో పిడి జయదేవ్ ఆర్య..
నవతెలంగాణ – రాయపోల్
అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని దాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఆర్డివో పిడి జయదేవ్ ఆర్య అన్నారు. శనివారం రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. రైతులకు మద్దతు ధరను చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దళారులకు దాన్యం విక్రయించి రైతులు నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, రైతులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి ఏమైనా అసౌకర్యాలు ఉంటే తెలియజేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. గోనెసంచులు లారీల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఆస కిషన్, టెక్నికల్ అసిస్టెంట్ రవి, సిఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES