Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి

- Advertisement -

పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం
నవతెలంగాణ –  ఆలేర్ రూరల్ 

ఆరుకాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రంలోనే అమ్మాలని పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం అన్నారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టి పెళ్ళ,రాళ్ళు,తాలు రాకుండా చూసుకొని క్వింటాల్ కు రూ.2389 ఏ గ్రేడు  వచ్చే విధంగా చూసుకోవాలన్నారు.అదే విధంగా సాధారణ రకం 2369 రూపాయలు క్వింటాలుకు పొందాలన్నారు.

ధాన్యాన్ని ఇంటి దగ్గరనే ఆరబోసి కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకువచ్చి మ్యాచర్ వచ్చే విధంగా చూసుకోవాలన్నారు.ఏమైనా సమస్య ఉంటే కొనుగోలు నిర్వాహకూనితో మాట్లాడాలన్నారు. తొందరపడి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోతే మైసయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు,మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య,పిఎసిఎస్ డైరెక్టర్ అరె మల్లేష్,సీఈఓ వెంకట్ రెడ్డి,నాయకులు గాదె సోమిరెడ్డి,చాడరాజు, దూడల రమేష్,ఐలయ్య బండపల్లి మహేష్,రమేష్, రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -