జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇప్పటివరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులకు తరలించడానికి లోడ్ చేయడానికి లారీలను అధికంగా పంపిస్తామని తెలిపారు.కేంద్రంలో ఈ రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు.తేమశాతం వచ్చిన కుప్పలు ఎన్ని ఉన్నాయని అడిగారు. తేమశాతం వచ్చిన ధాన్యం కుప్పలను ఎంత లేటు అయినా ఉండి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు.
అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వాతావరణంలో మార్పులు వచ్చే లోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు.కొనుగోలు కేంద్రంలో సరిపడా టార్పాలిన్ లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.రైతులు టార్పాలిన్ వాటిలో ఉంచుకోవాలన్నారు.రైతులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



