డిఎల్పిఓ శివకృష్ణ
నవతెలంగాణ – ఆర్మూర్
గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డి ఎల్ పి ఓ శివకృష్ణ అన్నారు. ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీడీవో గంగాధర్ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎల్.పి.ఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, సానిటేషన్ నిర్వహణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
పంచాయతీల్లో ప్రజా సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కూలీల హాజరు పట్టికల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజలింగం, పంచాయతీ కార్యదర్శులు శేఖర్, నవీన్, నసీర్, దినేష్, వందన, నాగంద్ర బాబు,కిషోర్, రానా తరుణం, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ సమస్యలను పరిష్కరించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



