ఎన్నికల నిర్వహణకు 559 మంది సిబ్బంది
రిటర్నింగ్ అధికారులు 21 మంది
ఎన్నికల నిర్వహణకు భారీ పోలీసు బందోబస్తు: మధిర రూరల్ సిఐ కొంగరి మధు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో మొదటి విడతగా గ్రామపంచాయతీ పోలింగ్ గురువారం జరగనున్నది. మండల వ్యాప్తంగా 22 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 210 వార్డులు ఉన్నాయి. అయితే కలకోట గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు పది వార్డులకు ఒక్కొక్కరి నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవం అయింది. అదేవిధంగా జానకిపురం గ్రామపంచాయతీలో ఒకటి, నాలుగు వార్డులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఒకటో వార్డు నుంచి పంది రమ్య నాలుగో వార్డ్ నుంచి చిలక శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్ద బీరవల్లి గ్రామపంచాయతీలో రెండవ వార్డుకు కూడా ఒక్కరే నామినేషన్లు దాఖలు చేశారు.
దీంతో ఇక్కడ కూడా ఎర్రబోయిన ఆదినారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మిగిలిన 197 వార్డులకు గాను పోలింగ్ జరగనున్నది. ఈ 197 వార్డులకు గాను మొత్తం 414 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.21 సర్పంచ్ స్థానాలకు మొత్తం 46 మంది పోటీ పడుతున్నారు. మండల వ్యాప్తంగా 36,381 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 17,611 మంది, స్త్రీలు 18,769 మంది ఓటర్ లో ఉన్నారు. అయితే కలకోట గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావటంతో ఎన్నిక జరగటం లేదు. మిగిలిన 21 గ్రామపంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నవి. 21 పంచాయతీలలో మొత్తం ఓటర్లు 34,570 మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 559 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. వీరు కాక 21 గ్రామపంచాయతీలకు 21 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ఒక్కొక్క బూత్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు ప్రెసిడెంట్ ఆఫీసర్ ఉంటారు. అయితే బూతులో 200 ఓట్లు దాటితే ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ ఇద్దరు అదనపు ప్రోసిడగ్ ఆఫీసర్లు ఉంటారని మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో రురావత్ రమాదేవి తెలిపారు.
అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు గాను 460 మంది పోలీస్ అధికారులను సిబ్బందిని నియమించారు. ఇందులో సిఐలు 20 మంది, ఎస్సైలు 30 మంది, మిగిలిన వారు హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులు ఉన్నారు. అయితే అత్యంత సమస్య ఆత్మక గ్రామాలైన గోవిందాపురం ఎల్ గ్రామంలో అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై పొదిలి వెంకన్న తెలిపారు. ఆళ్లపాడు, రాపల్లి గ్రామాలలో కూడా అదనపు బందోబస్తుని నియమిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మొదటి విడత పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత: మధిర రూరల్ సీఐ కొంగరి మధు
గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని మధిర రూరల్ సీఐ కొంగరి మధు తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై స్థానిక రైతు వేదిక నందు అవగాహన సదస్సు నిర్వహించారు.పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకొవాల్సిన ముందస్తు బందోబస్తు చర్యలు చేయాలన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులు గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పోలీస్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. పోలీంగ్ కేంద్రాలోకి ఓటర్లు వచ్చి వేళ్ళే మార్గాలలో వాహనాలు పార్కింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. ఏదైన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను సమచారం ఇవ్వడంతో పాటు అదనపు పోలీసు బలగాలను రప్పించుకోవాలన్నారు. ఈ అవగాహన సదస్సులో మండల ఎస్సై పొదిలి వెంకన్న ఎన్నికల విధులు కోసం వచ్చిన సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

hdrForward: 6; shaking: 0.033713; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0073,0.0000;
brp_del_sen: 0.1500,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 38;



