జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం గంభీరావుపేట ముస్తాబాద్ వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ జరిగిన మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వహణ జరగడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె వివరించారు.
జిల్లాలో గ్రామపంచాయతీ పోలింగ్ ప్రశాంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



