- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలో ఫార్మా కంపెనీ విషయంలో గ్రామపంచాయతీ పాలక వర్గ సమావేశం నిర్వహించారు.ఈ నెల జనవరి 7న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామ ప్రజలు ఫార్మ కంపెనీ ఏర్పాటు చేయవద్దని వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సభ్యులు గుర్తు చేశారు. గ్రామానికి పొంచి ఉన్న కాలుష్య ముప్పుపై సమావేశంలో చర్చించి సర్పంచ్ రేఖ సుదర్శన్, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీకి ఇచ్చిన పాత అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కలెక్టర్‌కు తీర్మాన పత్రం పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు పాలకవర్గం తెలిపారు.
- Advertisement -



