Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలుమంచినీటి కొరత తీర్చాలని గ్రామపంచాయతీ ముట్టడి

మంచినీటి కొరత తీర్చాలని గ్రామపంచాయతీ ముట్టడి

- Advertisement -

– బిందెలు, బకెట్లు పంచాయతీ గేటు ముందు పెట్టి నిరసన 
– సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంపీడీవో నిలదీత  
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో నెలకొన్న మంచినీటి కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 3నెలల నుండి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు  గ్రామ పంచాయతీ కార్యాలయన్ని బిందెలు, బకెట్ లతో ముట్టడి చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలువురు మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసిన, భూగర్భ జలమట్టం పెరిగిన మండల కేంద్రంలో ప్రజలకు నీటి సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు. గ్రామం మొత్తంలో నీటి సమస్యలున్న, 9 10 వార్డులో మాత్రం మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నాలుగు నెలలుగా తీవ్రంగా నీటి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

కుళాయి నీళ్లు సక్రమంగా రావడం లేదని, వచ్చిన నాలుగైదు బిందెలకు మించి నీళ్లు రావడం లేదన్నారు. నీళ్ల కోసం పతినిథ్యం ఇరుగుపొరుగు వారిని ఆశ్రయించాల్సి వస్తుందని, తమ సమస్యలు ఎప్పుడూ తీరుతాయో తెలియడం లేదని బాధను వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొని గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఎంపీడీవో, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి చింత రాజ శ్రీనివాస్ ను ఎస్సీ, బీసీ కాలనీవాసులు నీటి సమస్యలపై నిలదీశారు.

తమ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎప్పుడు పరిష్కరిస్తారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. గ్రామంలో బోర్లు సరిగా పోయకపోవడం, పైపులైన్ల  లీకేజీ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులను సముదాయించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగ జమున ప్రయత్నించారు. తమ నీటి సమస్యలు తీర్చే వరకు తాము ఆందోళన విరమించేది లేదని కాల్చిన కాలనీవాసులు స్పష్టం చేయడంతో ఎంపీడీవో,మిషన్ భగీరథ ఏఈ అమీర్ ఖాన్ ను గ్రామ పంచాయతీ వద్దకు పిలిపించారు. కాలనీల్లో నెలకొన్న నీటి సమస్యలపై ఆయనతో చర్చించి, సమస్యను 3రోజులలో తీరుస్తామని కాలనీవాసులకు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ హామీని ఇచ్చారు. అప్పటి వరకు ట్యాంకర్ తో నీటి సరఫరా చేయాలనీ గ్రామ పంచాయతీ సిబ్బందినీ ఆదేశించారు. నీటి సమస్యను తొందరలో పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడతామని కాలనీ వాసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -