Thursday, March 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్న మల్లారెడ్డిలో గ్రామసభ

చిన్న మల్లారెడ్డిలో గ్రామసభ

- Advertisement -

–  ఉపాధి హామీ పనుల గుర్తింపు
– మిషన్ భగీరథ పైపుల విస్తరణకు నిర్ణయం
నవతెలంగాణ –  కామారెడ్డి 

చిన్న మల్లారెడ్డి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్  భీమయల లక్ష్మి అధ్యక్షతన గురువారం గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులను గుర్తించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యగా మిషన్ భగీరథ అధికారులతో చర్చించి పైపుల విస్తరణ పనులను ప్రారంభిస్తామని సర్పంచ్ గ్రామ ప్రజలకు తెలిపారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై పేద విద్యార్థులు, కుటుంబాలు, రైతులు ప్రభుత్వ వైద్యం సహా వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందే విధానాలపై వివరించారు. గ్రామసభలో ప్రజలు ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, జీపీ కరోబార్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -