Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సర్పంచ్ అధ్యక్షతన సావెల్ లో గ్రామ సభ..

నూతన సర్పంచ్ అధ్యక్షతన సావెల్ లో గ్రామ సభ..

- Advertisement -

నవతెలంగాణ-మెండోర : గ్రామ అభివృద్ధి నిమిత్తం ప్రజలు గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ కంచు శ్యామల ముత్యం అన్నారు.
నూతన గ్రామ సర్పంచ్ కంచు శ్యామల ముత్యం అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. సభలో డ్రైనేజీ నిర్మాణ పనులు, అభివృద్ధి పనులు , నిధుల కేటాయింపు , సమస్యల పరిష్కారం మరియు గ్రామ ప్రగతికి సంబంధించిన అంశాలపై చర్చించి అభివృద్ధి పనుల ప్రణాళికలను రూపొందించి నిధుల ఖర్చుపై వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులుగా ఉన్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ పథకం , ఉపాధి హామీ పథకం ద్వార అందిస్తున్న పశువుల ఫ్లాట్ ఫామ్ లు , షెడ్డు నిర్మాణాలకు గ్రామ పంచాయతీ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మహిళా భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపుపై చర్చించారు. అనంతరం పల్లె దవాఖాన డాక్టర్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు పల్లె దవాఖానలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో టిబి మరియు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు మందులు అందుబాటులోకి వస్తాయని ఇట్టి అవకాశాన్ని సాధారణ మరియు దీర్ఘకాలిక రోగులు సద్వినియోగం చేసుకుని తగిన మందులు తీసుకోవాలని కోరారు. దవాఖాన సమస్యలు పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చి పల్లె దవాఖాన భవన నిర్మాణం కొరకు చర్యలు చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల సమస్యలు వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పల్లెదవాఖన , ప్రభుత్వ పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ పంచాయతీ పాలకవర్గం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచు శ్యామల ముత్యం , ఉప సర్పంచ్ చిట్యాల రాజ్ కుమార్ , వార్డు సభ్యులు రాజేందర్ , రవి , భూమన్న , రాణి , పోసాని , సెక్రెటరీ లత , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు , పల్లె దవఖాన వైద్య అధికారి , కరోబర్ కృష్ణ , అంగన్వాడీ టీచర్లు , ఏఎన్ఎం వాణి ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -