Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి

ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్  

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ, వార్డు సభలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చదివి వినిపించడం  జరుగుతుందన్నారు.

ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పథకం వంటి వాటి గురించి గ్రామ సభల్లో ప్రస్తావించాడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు  కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి,మున్సిపల్ కమీషనర్ లు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -