అలరించిన చిన్నారుల నృత్యాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో కొయ్యుర్ గ్రామంలోని విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల పిన్స్ పాల్ అండ్ కరస్పాండెంట్ ఎంకె సుదర్శనన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, మండల విద్యాధికారి లక్ష్మన్ బాబు తోపాటు పలువురు హాజరై మాట్లాడారు పేద విద్యార్థులకు తక్కువ పిజులతో ఆంగ్లబోధన అందించడంపై కరస్పాండెంట్ ను అభినందించారు.
ఇలాంటి వార్షికోత్సవాలు భవిష్యత్ లో మరిన్ని జరుపులోవాలని ఆకాంక్షించారు.అంతకముందు పలువురిని శాలువాలు,సీల్డ్ లతో కరస్పాండెంట్ సత్కరించారు.చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆయా ప్రయివేటు పాఠశాల కరస్పాండెంట్స్, వార్డు సభ్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



