నవతెలంగాణ – మల్హర్ రావు
అఖిల భారత స్వాతంత్ర సమరయోధుడు, మహనీయుడు వడ్డెర ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో వడ్డేర సంఘం జిల్లా కార్యదర్శి చల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, ఇందారపు సారయ్య, చల్లా మహేందర్ హాజరై మాట్లాడారు. తెల్ల దొరల పన్ను వసూళ్ల తీరును సహించక తిరుగుబాటు చేసిన ధీరోదాత్తుడు, తెలుగు ప్రజలు గర్వించదగిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్నని కొనియాడారు. అనంతరం ఒబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు జక్కం రాజేందర్, ఓజల చంద్రచారి, మహేష్, కుమార్, మురళి, లక్ష్మన్, సుధాకర్ పాల్గొన్నారు.
ఘనంగా ఒడ్డెర ఓబన్న జయంతి వేడుకలు.!
- Advertisement -
- Advertisement -


