Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ ప్రభుత్వాస్పత్రిలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..

జుక్కల్ ప్రభుత్వాస్పత్రిలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ వైద్యుడు విట్టల ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి ఆస్పత్రి ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండాను మెడికల్ ఆఫీసర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ మెడికల్ ఆఫీసర్ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మండలంలోని గ్రామ పెద్దలకు, అధికారులకు, కార్మికులకు, కర్షకులకు, నాయకులకు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పంద్రాగస్టు వేడుకల్లో మెడికల్ ఆఫీసర్ తో పాటు సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్లు,  ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad