నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని చంద్రకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మిత్ర ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కల్వకుర్తి పట్టణంలోని ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. మిత్ర ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు, మృతి చదిన కుటుంబాలకు అండగా ఉండి చేయూతనందిస్తున్న చంద్రకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ .. కల్వకుర్తి పట్టణంలో నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద ఉన్న అండగా ఉంటానని, మీ కుటుంబంలో ఒకడిగా నన్ను ఆదరించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఘనంగా మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుల జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES