Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం, ఏకాదశి హోమం 

ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం, ఏకాదశి హోమం 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
శ్రీరామనవమి వేడుకలలో భాగంగా శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వార్షిక ఏకాదశి హోమం నిర్వహించి అనంతరం స్వామివారి పట్టాభిషేకాన్ని వేదమంత్రాలతో, భక్తుల జయ జయద్వనాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ శశిరేఖ దంపతులు, ఈపూరి రవీందర్ రమ్య దంపతులు, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ దంపతులు, ఇల్లందుల సంధ్య, ఆలయ కమిటీ సభ్యులు కడవేరు కృష్ణవేణి, కొత్త శోభ, కోమటి భాస్కర్, కాపుగంటి నరేష్ తదితరులున్నారు.

oplus_2097152
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -