నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ ల్లోని మోచి సంఘ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే చౌర స్తాలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా దేశానికి విశేష సేవలందించారన్నారు. జగ్జీవన్ రామ్ దేశాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్, నాయకులు తాటేవర్ రమేష్, మోహన్ యాదవ్, బతినోళ్ల సాయినాథ్, జీవన్, మొచి సంఘం సభ్యులు సాయిలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగాబాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES