Wednesday, November 5, 2025
E-PAPER
Homeసినిమాఘనంగా డిజిటల్‌ ఐకాన్‌ అవార్డ్స్‌ వేడుక

ఘనంగా డిజిటల్‌ ఐకాన్‌ అవార్డ్స్‌ వేడుక

- Advertisement -

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన డిజిటల్‌ ఐకాన్‌ అవార్డ్స్‌ 2025 విజయ వంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్‌ క్రియేటర్స్‌, సినిమా, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.
సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్‌ డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ ఐ అండ్‌ పీఆర్‌ విభాగం ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. సినిమా బిజినెస్‌, బాక్సాఫీస్‌ విశ్లేషణ, ఇండిస్టీ ఎక్సక్లూసివ్‌ న్యూస్‌ అందిస్తున్న తరణ్‌ ఆదర్శ్‌, యాంకర్‌ సుమ కనకాల, ప్రముఖ బాలీవుడ్‌ పాపరాజో మానవ్‌ మంగ్లానీ, రా టాక్స్‌ వంశీ కూరపాటి తదితరులు ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు.
భారత్‌ డిజిటల్‌ మీడియా ఫెడరేషన్‌ వ్యవస్థాపకుడు విశ్వ సీఎం మాట్లాడుతూ,’ఇది ప్రారంభం మాత్రమే. భారత్‌ డీఎంఎఫ్‌ ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాలు, భాషలు, ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశ డిజిటల్‌ సష్టికర్తలను ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం. అవార్డుల నుండి సష్టికర్త సంక్షేమం వరకు భారతదేశపు మొట్టమొదటి క్రియేటర్‌ జోన్‌ను స్టార్ట్‌ చేయడం కోసం మేము నేషన్‌ ఫస్ట్‌ క్రియేటర్‌ ఎకో సిస్టమ్‌ను బిల్డ్‌ చేస్తున్నాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -