Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముత్యాలమ్మ, చిలుకల చిన్నమ్మ జాతర

ఘనంగా ముత్యాలమ్మ, చిలుకల చిన్నమ్మ జాతర

- Advertisement -

నవతెలంగాణ – డొంకేశ్వర్
మండలంలోని నికాల్ పూర్ గ్రామంలో ముత్యాలమ్మ, చిలుకల చిన్నమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో గ్రామస్తులు గోదావరి నది నుంచి జలాలను తీసుకువచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అలాగే గోదావరిలో స్నానాలు ఆచరించిన గ్రామ దేవతలు.. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా గ్రామంలోని ఆలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. ఈ వేడుకలకు గ్రామస్తులే కాకుండా.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ అనిత సుమన్ నాయక్, ఉప సర్పంచ్ కొండ నీరజ, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -