Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బిట్స్ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం 

బిట్స్ పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
స్థానిక పరకాల పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందస్తుగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పుష్ప మాల అలంకృతులను చేశారు. తర్వాత ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు.

తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో, పాటలతో ,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు. తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad