- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామినాథ్ లను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరినీ శాలువాలతో సత్కరించి గ్రామ పాలన బాధ్యతలను గ్రామస్తుల ఆశలకు అనుగుణంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.నూతన సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామినాథ్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.
- Advertisement -



