డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ వేడుక శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ సభాధ్యక్షులుగా వ్యవహరిం చారు. రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా, దర్శక, నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్‌వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని రచయిత మామిడి హరికష్ణకు అంకితమిచ్చారు.
పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ,’నేను సేకరించిన సినీ సమాచారంతో ’80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం’ పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో నంది పురస్కారం దక్కింది. ఇప్పుడు ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. నాకు సినిమా జర్నలిజంలో గురువులా భావించే మామిడి హరికష్ణకు ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నా. తెలంగాణ ప్రాంత సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ పైడి జయరాజ్, ఆయనకు ముందు నుంచే చాలామంది తెలంగాణ ప్రాంత నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా ఇండిస్టీలో ఎంతో ప్రతిభ చాటారు. ఇప్పుడు మన టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో కనీసం పది మంది తెలంగాణ వారు ఉండటం విశేషం’ అని అన్నారు.
ఘనంగా ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ వేడుక
- Advertisement -
- Advertisement -



