నవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్‌మేజర్ గ్రామ పంచాయతీతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు ప్రత్యేక అధికారుల సమక్షంలో తమ తమ బాధ్యతలకు సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవాలను సోమవారం చేపట్టారు. గ్రామపంచాయతీలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలను నిర్వర్తించి, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ప్రమాణ స్వీకారం చేసిన పాలక వర్గం తమ గ్రామాలను అన్నివిధాల అభివృద్ధి కిపాటుపడుతామని,గ్రామస్తులు, అధికారుల సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజాసేవ ధ్యేయంగా గ్రామాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఇది ఇలా ఉండగా గ్రామాభివృద్ధి పట్ల కొత్త నాయకత్వం శక్తివంతంగా ముందుకు సాగుతుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముధోల్ సిఐమల్లేష్ నేతృత్వంలో ఎస్ఐ బిట్ల పెర్సెస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లవ కుమార్ ,ఎంపిఓ శివ కుమార్, సూపర్ డెంట్ అశోక్, కార్యదర్శి లు,గ్రామాలలో ప్రజా ప్రతినిధులతో, పాటు గ్రామస్తులు, స్థానిక నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
.



