- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ చిలుకల చిన్నమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామ సర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్న తెలిపారు. ఈ జాతరను ప్రతి సంవత్సరంల గ్రామస్తులు ఆనవాయితీగా గంగా జలాన్ని డప్పులు, మంగళ హారతులతో ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామ దేవతకు జలాభిషేకం చేశారు. వివిధ గ్రామల ప్రజలు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బాల్కొండ ఎస్ఐ శైలేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
- Advertisement -



