Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రామలింగేశ్వరస్వామి రథోత్సవం 

ఘనంగా రామలింగేశ్వరస్వామి రథోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండల కేంద్రంలో సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి రథోత్సవాన్ని తిలకించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్,మాజి సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్,మాజీ ఎంపీటీసీ పోనుగోటి విజయరామారావు,బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు పోనుగోటి అంజన్ రావు,ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్,మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పాల్వాయి అనిల్ రెడ్డి,దంటు జగన్,సర్పంచ్ లు వల్లంల సంతోష్ యాదవ్,రొక్కం భాస్కర్ రెడ్డి,నక్క రాములమ్మ-రవి,గ్రామ పెద్దలు పోనుగోటి రవీందర్ రావు,పోనుగోటి హేమెందర్ రావు,పోనుగోటి వంశీచంద్ రావు,శ్రీనివాస్ రావు,బీజేపీ ఓబీసీ మోర్చా పిట్టల శ్రీనివాస్,బిఆర్ఎస్ నాయకులు బచ్చు రామకృష్ణ,చెరుకు శ్రీరామ్ గౌడ్,కొలుకులపల్లి యాదయ్య,రాపోలు యాదగిరి,పగడాల లింగయ్య,పురోహితులు ఎల్.వి శర్మ,సాయినాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -