Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడంపల్లిలో ఘనంగా సంధాల్ ఊరేగింపు యాత్ర

పడంపల్లిలో ఘనంగా సంధాల్ ఊరేగింపు యాత్ర

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో సందాల్ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో పడంపల్లిలోని లాలయ్య దర్గా వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మహిళలు,  భక్తులు,  గ్రామ పెద్దలు , దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏట నిర్వహించే ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన పావుడే శంకర్ బస్వంత్  నేతృత్వంలో సాయంకాలం గుర్రంపై  సందాల్ ఊరేగింపు నిర్వహించారు.

గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున సంఘాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా భాజ భజంత్రీలతో గ్రామం నుండి లాలయ్య పెద్ద దర్గా వరకు భారీగా జన సందోహం మధ్యలో ఊరేగింపుగా దర్గా వద్దకు వెళ్లి చాదర్ కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ మండలంలోని పలు గ్రామాలతో పాటు బిచ్కుంద మద్నూర్ మండలాల ప్రజలు భక్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు మా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ సంబంధాలు కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -