– రాష్ట్ర కీర్తి ప్రతిబింబించాలి : అధికారులు సమన్వయ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ వేడుకల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాల్లో జూన్ 2న జరుగనున్న ఏర్పాట్లను సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే జెండా ఆవిష్కరణ, మార్చ్ ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాలపై నిర్వహణ ప్రణాళికల్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోను ఈ వేడుకలను నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రావతరణ ఉత్సవాలకు అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరవుతారనీ, దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ వల్ల గతేడాది ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించలేక పోయామనీ, ఈ సారి రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, రఘునందన్‌రావు, సమాచార శాఖ కమిషనర్ హరీష్, పోలీస్ ఉన్నతాధి కారులు సీవీ ఆనంద్, నాగిరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES