Monday, July 21, 2025
E-PAPER
Homeదర్వాజగ్రాండ్‌ వెల్కమ్‌..!

గ్రాండ్‌ వెల్కమ్‌..!

- Advertisement -

తారాలోకం స్ఫూర్తి జ్వాలల
ఆహ్వానపు లేఖ పంపింది
అంతరిక్షం నిత్య నూతనపు
ప్రభాత ఇంద్రధనస్సై
పసిడి పూల పరిమళ సొగసుతో
అందంగా నవ్వింది
గగన వీధులన్నీ స్వాగత
కొమ్మలతో రమ్మంటూ
మేఘాల మధ్య విజేత ముద్రలతో
ఉషోదయపు దారేసింది
శుక్లా జీ….
మీకు మా సెల్యూట్‌
మన మువ్వన్నెల జెండా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో
విజ్ఞాన రేడియేషన్‌ను
విశ్వవ్యాప్తమై నిలిపింది
మనందరి గుండెల్లో
బడి గంటల సాక్షిగా
జనగణమన జాతి గుండె
స్పందనై నవ్య గానమై మోగుతోంది
రాకేష్‌ శర్మ అడుగుజాడలో
సారే జహాసే అచ్చా నవచరితను
సష్టిస్తూ మళ్ళీ ఓసారి వినిపిస్తుంది
స్పేస్‌ కలలకు మనమంతా
శూన్యపు ఊపిరిపై రెక్కలు తొడుగుదాం
భవిష్యత్‌ భారతంలో
నేటి బాలల కాంతివేగపు
చలన కాంక్షల ప్రతిభా కిరణాలకు
అంతరిక్ష ప్రయోగాల కథలమవుదాం
జీరో గ్రావిటీతో తేలిపోతూ
నవ కవితల శాస్త్రీయ ధ్వనులను
ఆలోచనల లెన్స్‌ గుండా లిఖిద్దాం
శుక్లా జీ…
We love you..!
Grand welcome to you..!


– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -