Saturday, March 14, 2026
E-PAPER
Homeజాతీయంఉత్తరాది రాష్ట్రాల్లో 'జన్‌ ఆక్రోశ్‌' జాతాలకు ఘన స్వాగతం

ఉత్తరాది రాష్ట్రాల్లో ‘జన్‌ ఆక్రోశ్‌’ జాతాలకు ఘన స్వాగతం

- Advertisement -

– 24న ఢిల్లీ రాంలీలా మైదానంలో సీపీఐ(ఎం) ప్రజార్యాలీ
– కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఉత్తరాది రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) చేపట్టిన ‘జన్‌ ఆక్రోశ్‌’ జాతాలకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 24న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేపట్టనున్న ప్రజా ర్యాలీకి ముందు గా ఈ జాతాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతాకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జుకృష్ణన్‌ నేతృత్వంలో జరిగిన జాతాకు చమోలి జిల్లాలోని థరాలి, కర్ణప్రయాగ్‌లో ఘన స్వాగతం లభించింది. కార్మికులు, రైతులు, టీ తోట కార్మికులు, ఆశా, అంగన్‌వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, విద్యార్థులు, మహిళలు, యువత జాతకు స్వాగతం పలికారు. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందా కరత్‌ ఉదయపూర్‌లోని గిరిజనుల భూమి పట్టాల సమస్యను ప్రస్తావించారు. బృందా నాయకత్వంలో గిరిజనులు తహసీల్దార్‌ను కలిసి, పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో జరిగే రెండో దశ జన్‌ ఆక్రోశ్‌ జాతాకు కూడా భారీ జనసందోహం కనిపిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించిన జన్‌ ఆక్రోశ్‌ మార్చ్‌కు రాష్ట్రం నుంచి సాంప్రదాయ సంగీత వాయిద్యాలు తోడుగా వచ్చాయి. హిమాచల్‌లోని మండి జిల్లాకు చేరుకున్న ఈ మార్చ్‌కు ప్రజలు డ్రమ్స్‌, పైపులతో స్వాగతం పలికారు. మార్చ్‌ అంతటా వీధి నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ మార్చ్‌కు రాష్ట్ర కార్యదర్శి సంజరు సింగ్‌, కేంద్ర కమిటీ సభ్యుడు విక్రమ్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మార్చ్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో యాపిల్‌ రైతులు కూడా వచ్చారు. ఉత్తరాఖండ్‌లో జరిగే మార్చ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా చురుగ్గా ఉన్నాయి. హర్యానా హిసారిథియ మార్చ్‌కు బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం లభించింది. హర్యానా మార్చ్‌కు రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌చంద్‌ నాయకత్వం వహిస్తున్నారు. బీహార్‌లోని ఐదు జాతాలకు స్వాగతం పలికేందుకు చాలా మంది కేంద్రాలకు చేరుకుంటున్నారు. పంజాబ్‌, జార్ఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా జాతాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -