Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి..

నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి..

- Advertisement -

– ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్. 
నవతెలంగాణ – ఊరుకొండ 

అన్ని రకాలుగా అర్హత కలిగి.. నివసించేందుకు ఇల్లు లేని నిరుపేద దళిత మహిళ గడ్డం మంజులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఓబీసీ జిల్లా అధ్యక్షులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్ వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ ఎంపీడీవో ను కోరారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడం వల్ల అనాధలైన భార్యాపిల్లలకు కనీసం నివసించేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

మహేందర్ భార్య గడ్డం మంజుల ఇద్దరు పిల్లలు మరియు ప్రస్తుతం ఆమె నిండు గర్భిణీ కావడంతో కటిక పేదరికంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే తాము ఇల్లు నిర్మించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో కృష్ణయ్య ఇల్లు మంజూరు అయ్యేందుకు సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తాడెం చిన్న, తిరుపతి రెడ్డి, రాజ్ నారాయణరెడ్డి, నరేందర్ గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -