Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకనీసం మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయండి

కనీసం మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయండి

- Advertisement -

12 ఏండ్లలో రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు : కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రానికి ఈ ఏడాదిలో కనీసం మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. 12 ఏండ్లుగా రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా 2014-23 వరకు దాదాపు పదేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్‌ ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పదేండ్లలో కేంద్రం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదని తెలిపారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు మూడు లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పదేండ్లలో కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కూడా రాష్ట్రానికి తీసుక రాలేదు. వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయూ తనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవం తమవుతుంది’ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ (పీఎంఏవై-జీ) 1.0లో భాగస్వామ్యం కాలేదని గుర్తు చేశారు. అయితే 2023 తర్వాత తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం పీఎంఏవై..జీ 2.0లో రాష్ట్రం అధికారికంగా చేరిందని తెలిపారు. పేద కుటుం బాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయ మని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం తమ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -