– రంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి సీతక్క
– కడ్తాల్ మండలం అనుమాన్‌పల్లి చెంచు రైతులకు చేకూరనున్న లబ్ది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అనుమాన్ పల్లి పంచాయతీ పరిధిలోని 54 ఎకరాలకు సంబంధించి చెంచు రైతులకు పట్టాలు మంజూరు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డిని మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను అనుమాన్‌పల్లికి చెందిన చెంచు రైతులు కలిశారు. 27 మంది చెంచు రైతులకు 1988లో అప్పటి ప్రభుత్వం 54 ఎకరాలను కేటాయించిందని గుర్తుచేశారు. ధరణి వల్ల ఆ భూములపై తాము పట్టాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు తమవి కాదని వెళ్లగొట్టడం సరిగాదని వాపోయారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలను తమకు ఇప్పించాలని చెంచు రైతులు మంత్రి సీతక్కను వేడుకున్నారు. వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి న్యాయం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ఆ చెంచు రైతులకు పట్టాలు మంజూరు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES