నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్, తోటపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కోసం డిఎంఎఫ్ టి నుండి రూ .30.80 లక్షలు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేశారు. పోతారం (ఎస్) జిల్లా పరిషత్ పాఠశాల కాంపౌండ్ వాల్ , టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణానికి రూ16.80 లక్షలు, తోటపల్లి మండల పరిషత్ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ 14.00 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కు మండల అధ్యక్షులు, మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్కూళ్లకు నిధుల మంజూరు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES