Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విఓ, ఫుడ్ స్టోరేజ్ భవనవ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వండి

విఓ, ఫుడ్ స్టోరేజ్ భవనవ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వండి

- Advertisement -

సొంత భూమి ఇవ్వడానికి తాము సిద్ధం
ఎంపిడిఓకు వినతిపత్రం సమర్పించిన సర్పంచ్, ఉప సర్పంచ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో విఓ మహిళ పొదుపు సంఘం, ఫుడ్ గెట్ స్టోరేజ్ భవనాల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని, నిర్మాణాలకు తమ సొంత భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి యాదవ్, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్ మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపిడిఓ క్రాంతికుమార్ కు వినపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భవన నిర్మాణాలకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రభుత్వ నిధులు సైతం మంజూరు చేసి,భవనాలు నిర్మాణం చేస్తామని ఇందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి తీర్మానం చేసినట్లుగా ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎంపిడిఓ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -