నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా విద్యుత్తు శాఖ డివిజనల్ ఇంజనీర్, కార్యాలయం ఎదుట, తెలంగాణ రాష్ట్ర ఆర్టిజన్ జాక్ పిలుపుమేరకు, విద్యుత్ ఆర్డిసన్లు, అన్ మెన్, మీటర్ రీడర్స్, కార్మికులు, భారీ ఎత్తున శాంతియుత ధర్నాను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ద్వేషించి జాక్ నాయకులు, కృష్ణ గౌడ్, నాంపల్లి, సునీల్ లు మాట్లాడుతూ, ఆర్టిజన్లు గత 20 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని అన్నారు. ఓకే సంస్థలో ఒకే రూల్ అమలుపరచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రతి సబ్ స్టేషన్లలో నలుగురు ఆర్టిజర్లను ఒక వాచ్ మెన్ ను, నియమించాలని, ఆర్టిజన్లకు, ఏపీఎస్పీ రూల్స్, తప్పనిసరి వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా కార్యక్రమంలో నాయకులు జయసింహారెడ్డి, బాలేశం, నర్సా గౌడ్, టి స్వామి, నరేష్, రాజు రెడ్డి లతోపాటు అధిక సంఖ్యలో విద్యుత్తు కార్మికులు హాజరయ్యారు.
విద్యుత్తు ఆర్టిజన్ల మహా ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



