నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపల్లి సర్పంచ్ జీడిమడ్ల నిర్మల, ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికను రూపొందించుకొని అడుగులు వేస్తున్న సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నార బోయిన రవి ముదిరాజ్ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో పాలకవర్గం పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సన్మానం చేసిన నారబోయిన రవి ముదిరాజ్ ను ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఉప్పునూతల స్వామి, వీఆర్వో సైదులు, బండారు మల్లేష్, జంగిలి నాగరాజ్ , వార్డు సభ్యులు జీడిమడ్ల నరేష్, దాం కేతమ్మ నరసింహ, సంకు శంకర్ తదితరులు ఉన్నారు.
కొంపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



