– రామచంద్రాపురంలో పనులు ప్రారంభించిన మేయర్
నవతెలంగాణ-రామచంద్రాపురం
హైదరాబాద్ మహా నగర అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్ పరిధిలో రూ.40 కోట్లా 70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నగేష్ అధ్యక్షతన జరిగిన సభలో.. మేయర్ మాట్లాడుతూ.. నగరం నలువైపులా విస్తరిస్తున్నందున జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రామచంద్రాపురంలో జీహెచ్‌ఎంసీ పార్కులు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనుల నిర్మాణం, రాయసముద్రం చెరువు సుందరీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జనాభాకనుగుణంగా గ్రేటర్ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



