Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశంలోనే అతిపెద్ద నగరంగా 'గ్రేటర్‌' హైదరాబాద్‌

దేశంలోనే అతిపెద్ద నగరంగా ‘గ్రేటర్‌’ హైదరాబాద్‌

- Advertisement -

జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన : జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
చిక్కడపల్లి – దోమలగూడ లింక్‌ బ్రిడ్జి ప్రారంభం


నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌ బృహత్‌ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ నిధుల్లో నుంచి రూ.6 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ సర్‌ ప్లస్‌ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన ‘చిక్కడపల్లి – దోమలగూడ లింక్‌ బ్రిడ్జి’ని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌ లోపల, ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న పురపాలికల విలీనంతో విస్తీర్ణం.. జనాభా పరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించిందన్నారు.

ఇక్కడ జనాభాకు తగ్గట్టు రోడ్లు, డ్రైన్‌లు, వీధి దీపాలు, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. జిలా ఇన్‌చార్జి మంత్రి గా.. స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ అదనపు కమిషనర్‌ రఘు ప్రసాద్‌, చీఫ్‌ ఇంజినీర్‌ భాస్కర్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, కార్పొరేటర్‌లు, ఎస్‌ఈ మోహన్‌ రెడ్డి, ఈఈ రోహిణి, డీఈఈ రేణుక, ఏఈఈ ప్రశాంత్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -