మూడేండ్ల నుంచి వాణిజ్య లైసెన్స్ కోసం నిరీక్షణ
ఆ సంస్థ చార్జీల పట్ల పరిశ్రమలో తీవ్ర చర్చ
న్యూఢిల్లీ : ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు కేంద్రం నుంచి కీలక అనుమతులు లభించాయి. భారత్‌లో కమర్షియల్‌గా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులను ఇండియన నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) మంజూరు చేసిందని తెలుస్తోంది. దీంతో 2022 నుంచి కమర్షియల్ లైసెన్స్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ అమెరికన్ సంస్థకు భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయ్యింది. టెలికాం శాఖ విభాగం నుంచి గత నెలలోనే స్టార్‌లింక్ అనుమతులు పొందింది. స్టార్‌లింక్‌తో పాటు వన్‌వెబ్, రిలయన్స్ జియోకు ఇప్పటికే ఈ తరహా అనుమతులు లభించాయి. ఇంకా ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ పొందడం, బేస్ స్టేషన్ల ఏర్పాటుకు మౌలిక వసతులు సమకూర్చుకోవడంతో పాటు తమ సేవలు సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు లోబడి ఉన్నాయని నిరూపించేందుకు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతి ఇచ్చిన వేళ ఆ సంస్థ చార్జీల పట్ల పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే స్టార్‌లింక్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయని తెలుస్తోంది. ఇటీవలే ఆ సంస్థ బంగ్లాదేశ్‌లోనూ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందుకోసం డేటా రిసీవర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ ధరను రూ.33,000 నిర్ణయించింది. నెలవారీ ప్లాన్ ప్రారంభ ధరల రూ.3,000గా ఉంది. అదే ధరలను భారత్‌లోనూ వసూలు చేయవచ్చని జాతీయ మీడియాల్లో రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్, జియో, భారతీ ఎయిర్‌టెల్ అందిస్తున్న బ్రాడ్‌బాండ్ ధరలతో పోల్చితే స్టార్ లింక్ ధర చాలా భారంగా ఉండనుంది. స్టార్ లింక్ శాటిలైట్ సేవలతో భారత రక్షణకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధిక చార్జీలు ప్రజల ఆదాయాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
స్పేస్ ఏజెన్సీ నుంచి స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగల్
- Advertisement -
- Advertisement -