- Advertisement -
నవతెలంగాణ చారకొండ
జడ్చర్ల నుండి కోదాడ జాతీయ రహదారి 167 రెండు వరుసలుగా ఉన్న రహదారిని నాలుగు వరుసల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బిజెపి నాయకులు చితపల్లి కిరణ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. చారకొండ మండల కేంద్రం మీదగా ఈ రహదారి నిర్మాణం జరగనుందని నాలుగు వరుసల రోడ్డుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధిలోకి వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
- Advertisement -