రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

charset=InvalidCharsetId

నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణంలో జెసిబిని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలో రామాయంపేట వైపు వెళ్తున్న జెసిబి స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేయడంతో వెనుక నుండి వస్తున్న ద్విచక్ర వాహనం జెసిబి ని ఢీకొనగా ద్విచక్ర వాహనంపై ఉన్న రామశేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ తరలించారు.

Spread the love