– అర్హులైన వారికే సంక్షేమ ఫలాలు
– వైఎస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 19, 20, 21, 22 వార్డుల పరిధిలో ఉన్న ఆయా ప్రభుత్వ పాఠశాలలో 2 వ రోజు శనివారం వార్డు సభలను మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న 6 గ్యారంటీల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాలను నిరుపేద కుటుంబాలకు అందించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు.వార్డులలో నెలకొన్న సమస్యలను పరిశీలించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యంగా త్రాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో మమేకమై తక్షణ నివారణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇంటి ఆవరణలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా గృహ యజమానులు సహకరించాలని అట్టి చెత్తను మున్సిపాలిటీ వాహనాలకు అందిందాలని అన్నారు. సంపూర్ణ పారిశుధ్యంతో ఉన్న వార్డులు ఆ పట్టణ గ్రామ అభివృద్ధికి నిలయాలుగా మారతాయని అందుకు ప్రజలు సహకరించాలని అభివృద్ధిలో వెన్నంటి ఉండి నడిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ తూడి దిలీప్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మిండ హరిబాబు, నార్లపాటి మౌనిక, నార్లపాటి మహేష్, ఎస్ కే నూర్జహాన్, నార్లపాటి దివాకర్, జినుగు రవీంద్ర లతోపాటు నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



